* రోడ్డున పడ్డ చిరు వ్యాపారులు
ఆకేరు న్యూస్. కరీంనగర్ : జగిత్యాల జిల్లా కొండగట్టు లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్య్కూట్ తో రోడ్డుపై ఉన్న దుకాణాల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పుణ్య క్షేత్రం కావడంతో భక్తులకు కావాల్సిన వస్తువులను ఇక్కడ వ్యాపారులు విక్రయిస్తూ ఉంటారు. దై వ దర్శనానికి వచ్చిన భక్తులు ఇక్కడ దుకాణాల్లో వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులతో పాటు నిత్యావసర వస్తువులు అ మ్ముతూ ఉంటారు. కొండగట్టుకు వెళ్లిన భక్తులు గుట్ట కింద వంట చేసుకొని తినడం అనవాయితీ వస్తూంది. ఈ నేపధ్యంలో భక్తులకు కావాల్సిన ప్లాస్టిక్ ప్లేట్లు ఇతర ఇస్తువులను ఈ దుకాణాల్లో విక్రయిస్తూ ఉంటారు. అయితే రానున్న సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో… ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ముందు వేములవాడ రాజరాజేశ్వరస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామిల దర్శనానికి వస్తుంటారు. ఈ క్రమంలోనే కొండగట్టు గుట్ట దిగువన ఉన్న దుకాణాదారులు కూడా భారీ మొత్తంలో భక్తులు కొనుగోలు చేసే సామాగ్రిని నిల్వ చేసుకున్నారు. ఈ సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే భారీ నష్టం చోటుచేసుకుంది. మరోవైపు అగ్ని ప్రమాదం విషయం తెలిసి అక్కడికి చేరకున్న దుకాణాదారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రూ.కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆర్డీవో మధుసూదన్ సందర్శించారు నష్టం అంచనా వేసి జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పిస్తామన్నారు. ఇదిలా కొండగట్టు అగ్ని ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ , కేంద్ర మంత్రి బండి సంజయ్ లు ఆరా తీశారు.
………………………………………………
