* భారీగా జన సమీకరణకు కార్యచరణ
* మంత్రి క్యాంప్ కార్యాలయంలో అధికారులకు దిశానిర్దేశం
ఆకేరు న్యూస్, కరీంనగర్ : ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ చర్యలు చేపట్టారు. సీఎం జిల్లాల షెడ్యూల్ ఖరార్ అయిన నేపథ్యంలో హుస్నాబాద్‌కు డిసెంబర్ 3న వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టౌన్, రూరల్ కాంగ్రెస్ కీలక నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. సీఎం శంకుస్థాపన చేసిన అనంతరం పట్టణంలో బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి హుస్నాబాద్‌కు వస్తున్నందున భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పీసీసీ అధ్యక్షుడిగా హుస్నాబాద్‌లో పర్యటించి, ప్రియాంకా గాంధీ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇక్కడకు వస్తున్నారని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా అధికారులు ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో క్లీన్ స్వీప్ సాధించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ పాటుపడి హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తానికి మొత్తంగా గెలుపు సాధించాలన్నారు.
……………………………………………………….
