* తెలంగాణాలోని పలు జిల్లాల్లో దీని ప్రభావం
* మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మొంథా తుఫాన్ నుంచి పూర్తిగా కొలుకోకముందే.. దిత్వా దూసుకొస్తుంది. శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుపాను భారత్ వైపు వస్తోంది. దీంతో దక్షిణ కోస్తా, తమిళానాడు, తెలంగాణాపై ప్రభావం ఉంటుందని వాతావరణశాఖాధికారులు తెలిపారు. ఆదివారం ఉదయానికి ఈ తుపాను పుదుచ్చేరికి 160, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు చెప్పారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందన్నారు. నల్గొండ, రంగారెడ్డి, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, సూర్యాపేట, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో దక్షిణ కోస్తాపై దిత్వా తీవ్ర ప్రభావం చూపుతుందని.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆయా జిల్లాలోని అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
……………………………………
