* కత్తులతో బెదిరించి..రూ. 40 లక్షలు దోచుకెళ్లిన దొంగలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నగరంలో చోరీ జరిగింది. సుల్తాన్ అనే వ్యక్తి ఇంట్లో ఇద్దరు వ్యక్తులు చొరబడ్డారు. కత్తులతో బెదిరించి రూ. 40 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. భవనీ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కత్తులతో బెదిరించి రూ. 40 లక్షలు దొంగిలించారని స్థానిక పోలీసులకు సుల్తాన్ ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
……………………………………..
