* ప్రతీ వంద మందిలో 13మందికి పెన్షన్లు
* సూపర్ సిక్స్.. సూపర్ సక్సెస్
* ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఏపీలో సూపర్ సిక్స్ ను సూపర్ సక్సెస్ చేశామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఆయన ఏలూరు జిల్లాలో పర్యటించారు. గ్రామసభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ కి ఆదాయం లేకున్నా అప్పులు ఉన్నాయన్నారు. అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎన్ని కష్టాలున్నా అమలు చేస్తున్నామన్నారు. ప్రతీ వంద మందిలో 13 మందికి పెన్షన్లను అందిస్తున్నామని సీఎం అన్నారు. ఏడాదికి 33 వేల కోట్లు పెన్షన్లపై ఖర్చుచేస్తున్నామని అన్నారు. పెన్షన్ పొందుతున్న వారితో 59 శాతం మహిళలే ఉన్నారని చంద్రబాబు అన్నారు.ఒకేసారి రూ.4వేలకు పింఛన్లు పెంచామని తెలిపారు. గత జగన్ ప్రభుత్వం ముక్కుతూ, మూలుగుతూ రూ. 250ల చొప్పున పెంచిందని విమర్శించారు. జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని.. లేకపోతే మిషన్లతో పనిచేయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు రూ.1650 కోట్లు బకాయిలు పెట్టిందని మండిపడ్డారు. ఆ బకాయిలను తీర్చడమే కాదని, ఇప్పుడు కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా నాలుగు గంటల్లో పైసలు ఇస్తున్నామని వివరించారు. 25 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకున్నారని గుర్తుచేశారు. ఇప్పటి వరకు రూ.550 కోట్లు ఉచిత బస్సు పథకానికి ఖర్చు చేశామని వెల్లడించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
………………………………………
