ఆకేరు న్యూస్, హనుమకొండ : విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశాయి. నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులకు అన్యాయం చేయడానికి నిరసిస్తూ హన్మకొండ నయీమ్ నగర్ లో విద్యార్థులతో కలిసి భారీ ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో హనుమకొండ పోలీసులు విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు కునుసోతు ప్రవీణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………….
