ఆకేరు న్యూస్, హనుమకొండ : హనుమకొండ శ్రీ చైతన్య సి బి ఎస్ ఇ పాఠశాలలో క్యాన్సర్ అవగాహన సదస్సును సోమవారం ఏర్పాటు చేశారు. ఇందులో డాక్టర్ సుమిత్ర. తిప్పాని MBBS.DGO గారు ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుండి విచ్చేసి విద్యార్థులందరికీ ఈ రోజుల్లో పెరుగుతున్న క్యాన్సర్ గురించి అవగాహన కల్పించారు. క్యాన్సర్ రావడానికి కారకమైన HPV వైరస్ గురించి వివరించారు. క్యాన్సర్ రాకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీధర్ సార్ గారు, అకాడమిక్ డైరెక్టర్ శ్రీవిద్య మేడం గారు, డీజీఎం చేతన్ గారు, కోఆర్డినేటర్ శివ కోటేశ్వర్ గారు, పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ మేడం గారు, డీన్ కర్ణాకర్ సార్ , ప్రైమరీ ఇన్చార్జ్ షాహిన్ మేడం, ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ శ్రావణి మేడం, మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
………………………………………………
