ఆకేరు న్యూస్, కరీంనగర్ : రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో కేశవపట్నం మోడల్ స్కూల్ విద్యార్థి ప్రతిభ కనబరిచాడు. గత నెల 28న ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో నిర్వహించిన సీనియర్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలలో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌కు ప్రాతినిధ్యం వహించిన విద్యార్థి పి. అనిల్ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాడు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27 జట్ల మధ్య జరిగిన ఈ పోటీల్లో కరీంనగర్ జిల్లా జట్టు ఐదవ స్థానాన్ని సాధించడం గర్వించదగిన విషయం. పోటీల్లో తన అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న పి. అనిల్ ప్రశంసా పత్రాన్ని అందుకోవడం ద్వారా తన ప్రతిభను మరోసారి రుజువు చేసుకున్నాడు. ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ నాగమణి, వ్యాయామ ఉపాధ్యాయుడు వాసుదేవ్ , అనిల్‌కు అభినందనలు తెలిపారు. శంకరపట్నం మోడల్ స్కూల్ నుండి రాష్ట్రస్థాయికి ప్రాతినిధ్యం వహించి ప్రతిభ కనబరిచిన అనిల్‌పై పాఠశాల ఉపాధ్యాయులు డా. మహేందర్, వనజ, సంధ్యా, ఫర్హీన, శంకర్ , సంపత్, మధుకర్ తో పాటు విద్యార్థులు అభిమానం వ్యక్తం చేశారు. ఇటువంటి విజయాలు పాఠశాల క్రీడా రంగానికి గొప్ప ప్రేరణ అని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.
……………………………………………………..
