* ఇరిగేషన్ తో పాటు ఎడ్యుకేషన్ కు ప్రాధాన్యం
* మక్తల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజాపాల వచ్చి రెండేళ్లు పూర్తి కానున్న సందర్భంగా మక్తల్ లో ఏర్పాటు చేసిన మొదటి విజయోత్సవ సభలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పదేళ్లు నిర్లక్ష్యానికి గురి కావడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ మీద నమ్మకం ఉంది కాబట్టే ఈ సారి ప్రజలు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారని సీఎం అన్నారు. స్వాతంత్యం వచ్చిన
తొలినాళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లానుంచి బూర్గుల రామకృష్ణారావు సీఎం అయ్యారని ఆ తరువాత 75 ఏళ్లకు ఈ జిల్లా నుంచి తాను అయ్యానని రేవంత్ అన్నారు.మహిళలను వ్యాపార వేత్తలుగా మార్చేందుకు చర్యలు. దేశానికి, రాష్ట్రానికి పాలమూరును ఆదర్శంగా మారుస్తాం. ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధం. ఇరిగేషన్‌తో పాటు ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతి పేద బిడ్డకు చదువు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూళ్లు ప్రారంభించాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తే ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్తల్ పర్యటనలో భాగంగా సీఎం 200 కోట్లతో సమీకృత గురుకు పాఠశాల భవనానికి, మక్తల్ నారాయణ పేటల మధ్య నాలుగు లైన్త రోడ్డు నిర్మాణానికి క్రీడాభవన నిర్మాణానికి సీఎం శంకు స్థాపనలు చేశారు.
……………………………………………………..
