* గద్వాల ఎస్టీ హాస్టల్ లో ఘటన
* ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 మంది విద్యార్థులు
* ఒకరి పరిస్థితి విషమం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి.ప్రభుత్వ అధికారులు, హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా గద్వాల ఎస్టీ హాస్టల్లో ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థుల్లో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఉదయం తిన్న ఉప్మాలో పురుగులు వచ్చినట్టు విద్యార్థులు హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఉప్మా తిన్న విద్యార్థులు యధావిధిగా స్కూల్ కి వెళ్లగా కొద్ది సేపటికే విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది విద్యార్థులును హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతుండగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
…………………………………………………..
