* ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘటన
ఆకేరు న్యూస్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేని పల్లిలో మంగళవారం ఉదయం అ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డ్రైవర్‌పై కోపంతో క్లీనర్ జరిగిన గొడవ బస్ దహనానికి దారితీసింది. డ్రైవర్ నబిపై కోపంతో క్లీనర్ బస్‌లో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సమయానికి బస్ లో విద్యార్థులు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ ఘటనలో బస్ డ్రైవర్ నబీకి స్వల్ప గాయాలు కాగా అతడిని స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లీనర్ గోపాల్ ను అరెస్ట్ చేశారు.
…………………………………………………
