* రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి
* జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్
ఆకేరు న్యూస్, ములుగు:మేడారం మహా జాతర కోసం వచ్చే భక్తులు మొదట జాకారం సమీపంలోని గట్టమ్మ దేవాలయాన్ని సందర్శించుకుంటారని, ఆ సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను, ట్రాఫిక్ నియంత్రణకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్ అధికారులకు సూచించారు.నూతన రహదారుల ఏర్పాట్లు ,రోడ్డు విస్తరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని, వివిధ శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ములుగు డిఎస్పి రవీందర్, ములుగు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శంకర్ నాయక్, ములుగు సిఐ సురేష్, ములుగు ఎస్ఐ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
…………………………………………
