ఆకేరున్యూస్,వరంగల్ : జిల్లాలోని దుగ్గొండి మండలం బంధంపల్లిలో సర్పంచ్ పదవి జనరల్ కేటగిరీగా రిజర్వ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ములుగు మాజీ ఎస్ఐ పోరెడ్డి లక్ష్మారెడ్డి అమెరికాలో ఉన్నప్పటికీ సర్పంచ్ గా పోటీకి నామినేషన్ పంపించారు. ఆన్ లైన్ లో ఫారం డౌన్లోడ్ చేసుకుని సంతకం చేసిన ఆయన, స్పీడ్ పోస్టు ద్వారా రిటర్నింగ్ అధికారి భద్రమ్మకు చేరేలా పంపించారు. లక్ష్మారెడ్డి భార్య సుభద్ర 2013-18లో ఇదే గ్రామానికి సర్పంచ్‌గా పని చేశారు.
…………………………………………………..
