* ఎనిమిదేళ్ల బాలికపై యువకుడి లైంగిక దాడికి యత్నం..
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో వేల్పుల కమల్ అనే యువకుడు కిరాణా షాప్ నిర్వహిస్తుంటాడు. ఈ నెల రెండవ తేదీ రాత్రి కిరాణా దుకాణంలో సరుకులు కొనేందుకు వెళ్లిన 8 ఏళ్ల బాలికను లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో దుకాణానికి వేరే వారు రావడంతో పాప బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అనంతరం విషయం తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
