* ఇండిగో పై ప్రయాణికుల ఆగ్రహం
* సమన్లు జారీ చేసిన డీజీసీఏ
ఆకేరు న్యూస్, డెస్క్ : విమానాలు రద్దు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒకేసారి 200కు పైగా విమానాల రద్దుతో విమాన ప్రయాణికులు రోడ్డుపై పడ్డారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ విమానాశ్రయాల్లో చాలా విమానాలు రద్దు అయ్యాయి. దీంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వెళ్లే విమనాల్లో 35, హైదరాబాద్ లో 65కు పైగా విమానాలు రద్దు అయ్యాయి. నిన్న నాలుగు నగరాల్లో కలిపి 200కు పైగా విమానాలు రద్దు అయ్యాయి. దేశ వ్యాప్తంగా 35 శాతానికి పడిపోయిన విండోగ విమాన సర్వీసులు. విమానాల ఆకస్మిక రద్దుపై విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో పరిస్థితి సాధారణ స్థాయికి వస్తోందని ఇండిగో యాజమాన్యం పేర్కొంటోంది. కాగా ఈ పరిస్థితులపై తీవ్రంగా స్పందించిన పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) ఇండిగో ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. దేశంలో అతిపెద్ద సంస్థలో నెలకొన్న కార్యాచరణ సమస్యలపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు డీజీసీఏ ఈ చర్య తీసుకుంది. విమానాల ఆలస్యం, రద్దుపై ఇండిగోకి సమన్లు రాజీ చేసింది. మధ్యాహ్నం లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. క్యాబిన్ సిబ్బంది కొరత, విమానాశ్రయాల్లో రద్దీ, పైలట్ రోస్టర్ విధానాల వల్లే సమస్యలు ఉత్పన్నం అయ్యాయని ఇండిగో పేర్కొంటోంది.
…………………………………….
