– 36 ఏళ్లుగా దత్త జయంతిని నిర్వహిస్తున్న భక్తులు
ఆకేరు న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో దత్తాత్రేయ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉప్పల్ లోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని పురోహితులు శ్రీరంగం కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో లక్ష్మణాచార్యులు, హరీషాచార్యులు , శ్రీనివాసచార్యులు ఉదయం నుంచి స్వామి వారికి పంచామృత అభిషేకాలు కార్యక్రమాలు, అర్చనలు, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.1988 నుంచి గత 36 ఏండ్లుగా ఉప్పల్ షిరిడి సాయిబాబా దేవాలయంలో భక్తుల సహకారంతో దత్తాత్రేయ జయంతి వేడుకలను ఘనంగా జరుపుతూ అన్న ప్రసాద వితరణ చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, శ్రీ షిరిడి సాయిబాబా సేవ సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………….
