ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ఆవరణలో మాస్టర్ ప్లాన్ లో భాగంగా గురువారం గోవిందరాజుల గద్దెలను పూజారుల ఆధ్వర్యంలో స్థాన చలనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం జరగబోయే మేడారం మహా జాతరను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్ లో భాగంగా అమ్మవార్ల గద్దెలను భక్తులు సులభంగా సందర్శించుకుని మొక్కులు చెల్లించుకునే విధంగా సమ్మక్క, సారలమ్మ ,పగిడిద్దరాజు, గోవిందరాజుల, గద్దెలను వరుస క్రమంలో నిర్మాణలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సమ్మక్క సారలమ్మ గద్దెలు యధా స్థానంలో ఉండగా గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెలుమార్పులు చేశారు. గత నెలలో పగిడిద్దరాజు గద్దెను స్థాలన చరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం గోవిందరాజుల గద్దె ను ఆ పూజారులు కొండాయి నుంచి ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలతో డోలు వాయిద్యాలు నడుమ ఆ గద్దె పై ప్రత్యేక పూజలు నిర్వహించి స్థాన చలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతము గోవిందరాజుల గద్దె నిర్మాణంలో ఉన్నందున ఈనెల 24న పూర్తి స్థాయిలో భక్తులు ఆ గద్దె పై మొక్కులు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతము మహా జాతర కు భక్తుల పరంపర కొనసాగుతోంది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు . ఈ గోవిందరాజుల గద్దె స్థాన చలన కార్యక్రమంలో పూజారసంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, కార్యదర్శి చందా గోపాలరావు, ఉపాధ్యక్షుడు కాక సారయ్యలతో పాటు పూజారులు కాక వెంకటేశ్వర్లు కాక భుజంగరావు, కొక్కెర కృష్ణయ్య, దబ్బగట్ల గోవర్ధన్ , చందవెంకన్న, చంద రఘుపతిరావు, సిద్ధబోయిన జనార్ధన్, మహేష్, భోజరావు, ధనుంజయ లతో పాటు బయ్యక్కపెట, మేడారం, కోండాయి, పూనుగోండ్ల కామారం గ్రామాల పూజారులు దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

……………………………………………………..
