ఆకేరు న్యూస్, ములుగు: మేడారం మహా జాతర పరిసరాలలో బిఎస్ఎన్ఎల్ సేవలకు అంతరాయం కొనసాగుతుంది .గత వారం రోజులుగా సెల్ సిగ్నల్స్ లేకపోవడంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా గత నెల రోజుల నుంచి మేడారం, ఊరటం, కన్నెపల్లి ,నార్లాపూర్, రెడ్డిగూడెం ,కొత్తూరు, జంపంగవాయి తదితర గ్రామాలలో ముమ్మరంగా మేడారం మహా జాతర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి .అయితే ప్రస్తుతం సిగ్నల్స్ అంతరాయం కలుగుతున్నడంతో రాష్ట్ర నలుమూలల నుంచి మేడారం చెరుకునే భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతోపాటు వ్యాపారులు, అధికారులు, కాంట్రాక్టర్లు ,కూలీలు సైతం సమాచార సేకరణ లోపంతో అనేక విధాలుగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత బిఎస్ఎన్ఎల్ అధికారులు స్పందించి మేడారం మహా జాతర పరిసరాలతో పాటు పరిసర గ్రామాల్లో సైతం బిఎస్ఎన్ఎల్ నెట్, సెల్ ఫోన్ సిగ్నల్ సేవలు అంతరాయం కలగకుండా కొనసాగించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని భక్తులు ఆయా గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.
………………………………………
