* రూ.3.38 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆన్లైన్ పరిచయం.. ఓ మహిళ పెళ్లి పేరుతో మోసపోవడానికి కారణమైంది. స్నేహితుడిగా తీయని మెసేజ్‌లు పంపుతూ భాగస్వామినవుతానని చెప్పి పలు దఫాలుగా సుమారు 4 లక్షలు కాజేశాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు ఆన్లైన్లో హిరాద్ అహ్మద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. యునైటెడ్ కింగ్డ్మ్లో డాక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పిన సైబర్ నేరగాడు వాట్సప్ చాటింగ్, వీడియో కాలింగ్ ద్వారా దగ్గరయ్యాడు. యూకేకి వస్తే వెళ్లి చేసుకుంటాననని నమ్మబలికాడు. వీసా ప్రాసెసింగ్‌లో భాగం అంటూ సైబర్ నేరగాడు చెప్పిన విధంగా రెండు బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు యూకే అఫైర్స్ ఆఫీస్ పేరుతో అతడు సూచించిన చిరునామాకు పంపింది. నకిలీ వీసా, వివాహ పత్రాలు ప్రాసెసింగ్ మొదలైందని చెప్పి, నకిలీ పత్రాలు పంపాడు. తర్వాత కొత్త నెంబర్ల నుంచి ఆమెను సంప్రదించిన సైబర నేరగాళ్లు వీసా ప్రాసెసింగ్ చార్జీలు, లేట్ ఫీజు, లగేజ్ చార్జీలు, హోటల్ రూము, విమాన టికెట్లు రకరకాల ఫేజుల పేరుతో దాదాపు 4 లక్షల వరకు వసూలు చేశారు. అనంతరం డాక్టర్ కాంటాక్ట్‌లోకి రాకపోవడంతో బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
………………………………………….
