* రెడ్ హ్యండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
ఆకేరు న్యూస్, హనుమకొండ : ఏసీబీ వలలో హనుమకొండ జిల్లా కలెక్టర్ వెంకట్ రెడ్డి చిక్కాడు. ఓ ప్రైవేట్ స్కూల్ యజమాని పాఠశాల రెన్యువల్ కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. సాధారణంగా జరగాల్సిన పని కోసం డబ్బులు ఎందుకివ్వాలని యజమాని విద్యాశాఖ అధికారులను ప్రశ్నించినప్పటికీ పట్టించుకోలేదంటున్నారు. నేరుగా విషయాన్ని విద్యాశాఖలోని జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఇద్దరు విద్యాశాఖ ఇంచార్జీగా ఉన్న అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్ళారు. అడిషనల్ కలెక్టర్ కనీసం రూ. 75 వేలు అయినా ఇవ్వాల్సిందేనని చెప్పినట్టు సమాచారం. దీంతో సదరు పాఠశాల యజమాని ఏసీబీ అధికారులను కలిసి సమస్య వివరించడంతో అవినీతి భాగోతాన్ని రెడ్ హ్యండెడ్గా పట్టుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. స్కూల్ యజమాని దగ్గర రూ. 60 వేలు లంచం తీసుకోవడంతో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. అడిషనల్ కలెక్టర్ చాంబర్లో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
………………………………….
