ఆకేరు న్యూస్, ములుగు: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో యువజన సంఘాలు, దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల నివాళులుఅర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అంబేద్కర్ సేవలు ఆశయాలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క చితపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ , బీసీ సెల్ అధికార ప్రతినిధి గండ్రత్ జయాకర్, కిసాన్ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి నూనెటి శ్యామ్, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………….
