– మనుషుల ఆత్మగౌరవానికి వెలకట్టలేరు.
– బిజెపి పార్టీ సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించండి.
– మీకు తోడుగా, నీడగా నేనుంటా.
– మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
ఆకేరు న్యూస్, కమలాపూర్ :
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఐదు పైసలు కూడా లేవని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కమలాపూర్, గుండేడు , భీంపల్లి, మర్రిపల్లి గూడెం, వంగపల్లి, శనిగరం గ్రామాలలో శనివారం ఈటల రాజేందర్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన సర్పంచ్, వార్డ్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బులతో ఓట్లను కొనలేమని, మనుషుల యొక్క ఆత్మ గౌరవానికి వెలకట్టలేమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా గత సర్పంచులు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు చెల్లించలేదని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు, కరెంటు బిల్లులు ఇవ్వడానికి కూడా రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు.ఈటల పేదల పక్షాన కొట్లాడే బిడ్డ. అధికారం ఉన్నా లేకున్నా మీకు కావాల్సినవి అందించే భాద్యత నాది అని ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గెలిచి రెండేళ్లయిన చేయడానికి ఏమీ లేదని, చేసే ఆస్కారం కూడా లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తామే బిక్షం ఎత్తుకుంటున్నామంటు చెప్తున్నారని కానీ నేడు మీరు తీసుకుంటున్న రేషన్ బియ్యం 6 కేజీల్లో 5 కేజీలు మోడీగారి దగ్గర నుండి వస్తున్నాయి.ఉపాధిహామీ పథకం మెటల్ కాంపౌడ్, సీసీ రోడ్లు, మురికి కాలువలు, రైతువేదికలు, స్మశాన వాటికలు, తడి చెత్త – పొడి చెత్త షెడ్డులు, గ్రామపంచాయితీ భవనాలు పెరిగే చెట్లు, వెలిగే లైట్లు అన్నీ కేంద్రం ఇస్తున్నవే. కేంద్రంలో మేమున్నాం కాబట్టి నిధులు తీసుకువస్తాం.మన మన వాడెవడో మంది ఎవడో తెలవకపోతే ఆగమైతమని స్థానిక ఎన్నికల్లో రాజేందర్ ని, రాజేందర్ టీం ని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు మాట్లాడుతూ…. మా బలం ఈటెల అన్న, మా బలం ఈటల ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించండి అని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.
ఈటల ప్రతినిధిగా పనిచేస్తా..
విలేకరిగా గత 20 ఏళ్ల నుంచి అనేక ప్రజా సమస్యల మీద వార్తలు రాసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి,పరిష్కారం అయ్యేలా కృషి చేశానని,ఈటల రాజేందర్ ప్రతినిధిగా పని చేయడానికి మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి. మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి అని కమలాపూర్ సర్పంచ్ అభ్యర్థి పబ్బు సతీష్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

…………………………………………………
