* జాతరలో పోలీస్ అత్యవసర సేవలకు సూచనలు
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం మహా జాతరను పురస్కరించుకొని అమ్మవార్ల గజ్జల ఆవరణలో జరుగుతున్న పునః నిర్మాణ పనులు ములుగు జిల్లా పోలీసు అధికారి కేకాన్ సుధీర్ రామనాధ్ క్షేత్రస్థాయిలో సందర్శించి ప్రత్యక్షంగా పరిశీలించారు. మొదట సమ్మక్క సారలమ్మల దర్శనం అనంతరం పునర్నిర్మాణ పనుల పురోగతిని వివరంగా పరిశీలించారు .మేడారం జాతర లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాలయ ఆవరణలో భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలను పోలీసింగ్ అవసరాలు అత్యవసర సేవల సమన్వయం వంటి అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. పనుల నాణ్యత నిర్మాణ వేగం భద్రతా ఏర్పాట్లు,భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. మేడారం జాతర సమయంలో పోలీసులు చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలకు అనుగుణంగా సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ములుగు డి.ఎస్.పి రవీందర్ పస్రా సిఐ దయాకర్ సిసిఎస్ సి ఐ బండారి కుమార్ సీఐ శ్రీనివాస్ ఇతర ఎస్ ఐ లు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

………………………………………………
