* పోలీసుల కళ్లుగప్పి పరారీ
* హనుమకొండ పోలీసుస్టేషన్ లో ఘటన
ఆకేరు న్యూస్, వరంగల్ : హనుమకొండ పోలీసుస్టేషన్ ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలు పరారయ్యారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. నార్కోటిక్స్ పోలీసులు పట్టుకుని అప్పగించిన గంజాయి కేసు నిందితులు స్టేషన్ నుంచి పరారు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇతర రాష్ట్రానికి చెందిన ముగ్గురు నిందితులను గంజాయి కేసులో నార్కొటిక్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ అయిన హనుమకొండ పోలీసులకు అప్పగించారు. హనుమకొండ పోలీసు స్టేషన్ కంప్యూటర్ రూమ్ నుంచి సోమవారం తెల్లవారుజామున 5గంటలకు సెంట్రీ డ్యూటీ పోలీసుల కళ్లు గప్పి కంప్యూటర్ రూమ్ వెనుక భాగం డోర్ పగలగొట్టి ముగ్గురు దొంగలు పరార్ అయ్యారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీంతో వారిని పట్టుకోవడానికి హనుమకొండ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ముఖ్యప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిర్ణీత సమయంలోగా వారిని పట్టుకోకపోతే సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నారు.
……………………………………….
