* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని వివిధ మండలాల్లో గల మారుమూల గ్రామాల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని ప్రస్తుతం జరగబోయే పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని మంత్రి సీతక్క కోరారు. మంగళవారం తాడ్వాయి మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమానికి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం జరగబోయే ఎన్నికలలో ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు .జిల్లా వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరిస్తూ ప్రస్తుతం రాబోయే రోజులలో సైతం ప్రతి గ్రామాభివృద్ధికి తన తోడ్పాటు అందిస్తూ కృషి చేస్తానని వివరించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి ప్రజా ప్రభుత్వం చేసిందని చేస్తున్నదని అన్నారు. దీనిని జీర్ణించుకోలేని కొంతమంది నాయకులు తనపై కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారని అన్నారు. వారి మాయమాటలకు నమ్మి మోసపోవద్దు అంటూ ఓటర్లను కోరారు. తాను పంచాయితీ రాజ్ మంత్రిగా ఉన్నానని ఏ సమస్య వచ్చిన పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రతి గ్రామ సమస్యను పరిష్కరిస్తానని వివరించారు. మండలంలోని 18 గ్రామపంచాయతీలలో మూడు గ్రామపంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నదని, 15 పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారని వివరించారు. ఇందులో తమ పార్టీ తరఫున బలపరిచిన వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు . తాడ్వాయి మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి ఇరుప సుకన్య- సునీల్ దొర ఉంగరం గుర్తుకు ఓటేయాలని కోరారు. వార్డు సభ్యులను సైతం గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో ములుగు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి ,మండల కమిటీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ,మేడారం జాతర కమిటీ చైర్మన్ ఆరేం లచ్చు పటేల్ ,స్థానిక నాయకులు పాక సాంబయ్య, యానాల సిద్దిరెడ్డి, బండారి చంద్రయ్య , పాక రాజేందర్, ముదురుకోళ్ల తిరుపతి, లతోపాటు ఇందిరా నగర్ ,ఎస్టీ కాలనీ, నర్సింగాపూర్ ,కొండపర్తి తదితర గ్రామాల కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ఓటర్లు పాల్గొన్నారు.

………………………………………………….
