* కమిషనర్ ఆకస్మిక నిర్ణయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్షణం ఆదేశాలు అమల్లోకి వస్తాయని మంగళవారం పేర్కొన్నారు. ఆర్జీఐ ఎయిర్‌పోర్టు ఎస్హెచ్ఓగా పనిచేస్తున్న కె.బాలరాజును గచ్చిబౌలి ఎస్హెచ్ఓగా, ప్రస్తుతం గచ్చిబౌలి ఎస్హెచ్ఓగా ఉన్న మహ్మద్ హబిబుల్లాఖాన్ను వెకెన్సీ రిజర్వులో ఉంచారు. సీసీఎస్ మాదాపూర్‌లో పనిచేస్తున్న బి.సంజీవులును ఎస్హెచ్ఓ ఆర్జీఐ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా, మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బి.సత్యనారాయనను ఎస్హెచ్ఓ మైలార్‌దేవ్‌పల్లికి బదిలీ చేశారు. ఎస్హెచ్ఓ మైలార్దేవ్పల్లిగా ఉన్న పి.నరేందర్‌ను ఈఓడబ్ల్యు సైబరాబాద్‌కు బదిలీ అయ్యారు. కూకట్పల్లి ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఎం.ముత్తు యాదవ్‌ను రాజేంద్రనగర్ ఎస్హెచ్ఓగా, అల్వాల్ పోలిస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న జి.తిమ్మప్పను కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు. డీసీపీ మాదాపూర్జోన్లో ఇన్స్పెక్టర్గా ఉన్న కె.వీరబాబును, అల్వాల్ పోలిస్ స్టేషన్ డీఐగా, శంషాబాద్ జోన్ ఎస్బీగా ఉన్న బి.నాగేంద్రబాబును మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు.
………………………………………………
