ఆకేరు న్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఓ కారు బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. జైనాథ్ మండలం తరోడ సమీపంలో బుధవారం
తెల్లవారు జామున ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన జైజవాన్ నగర్, లక్ష్మీనగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రాకు మేస్ర్తీ పనులు చేసేందుకు వెళ్లి.. తిరిగి ఆదిలాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
మృతదేహాలను జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………………
