* “సర్వం సిద్ధం” పేరుతో ఉదయం 11 గంటలకు సభ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీఎం రేవంత్ నేటి ఉదయం 11 గంటలకు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రానున్నారు. విద్యార్థులు, అధ్యాపకుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ, వర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధమని సీఎం గతంలోనే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అకడమిక్ బ్లాక్లు, హాస్టళ్లు, ఇతర విద్యార్థి సౌకర్యాలను పరిశీలించి, అభివృద్ధి పనులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. వర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటికే రూ. 1000 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్ట్స్ కాలేజీ భవనంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన విద్యార్థులతో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రానుండడంతో యూనివర్శిటీ చరిత్రలో మరో ఘట్టంగా నిలవనుందని చెబుతున్నారు. యూనివర్శిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఇందులో భాగంగా ఓయూని అభివృద్ధి చేసేందుకు సీఎం చర్యలు చేపట్టారు. త్వరలోనే వర్శటీలో ఖాళీలను సైతం భర్తీ చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది.
……………………………………………..
