* యువకునిపై కత్తులతో దాడి
* తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. కామాటిపురలో అరవింద్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దీంతో యువకుడికి తీవ్రగాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షల కారణంగానే యువకుడిపై దాడి చేసి.. హత్య చేశాడరని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇంతకు ముందు పాతబస్తీలో ఓ రియల్టర్ హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజుల్లోలనే మరో యువకున్ని కత్తులతో పొడిచి హతమార్చడంతో కాలనీ లో ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉందని బస్తీవాసులు ఆందోళన చెందుతున్నారు.
……………………………………………
