* కామారెడ్డి జిల్లాలో ప్రమాదం
ఆకేరు న్యూస్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో విద్యార్థులతో వెళ్తున్న ఆటో పడిన ఘటనలో ఒకరు మృతి చెందడం విషాదాన్ని నింపింది. మరో 14 మందికి గాయాలు అయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థిని పదో తరగతి చదువుతున్న ప్రణవ్ (15)గా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
…………………………………………….
