* ప్రమాదవశాత్తు కాలు జారిపడి వ్యక్తి మృతి
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి జారి పడడంతో విషాదం నెలకొంది. వరంగల్ జీఅర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎస్ రవీందర్ రెడ్డి వివరాల మేరకు.. బుధవారం ఉదయం వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు 50 ఏళ్ల వ్యక్తి వచ్చాడు. అతను ట్రైన్ ఎక్కుతుండగా పట్టుతప్పి రైలు పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో రైలు ప్లాట్‌ఫామ్‌పై నుంచి ముందుకు కదిలింది. దీంతో రైలు ఆ వ్యక్తి మీద నుంచి రైలు చక్రాలు వెళ్లడంతో శరీరం రెండు ముక్కలై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రయాణికుని వద్ద రైల్వే టికెట్ తప్ప మరెలాంటి ఆధారాలు లేవని.. అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదని.. రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రి మార్చురీలోఉంచామన్నారు. ఆచూకీ తెలిసినవారు వరంగల్ రైల్వే జీఆర్పీ ఠాణా, రైల్వే పోలీసుల మొబైల్ నెంబర్లు. 9849749220, 8712658627 సంప్రదించాలని చెప్పారు.
………………………………………………
