* భద్రాచలంలో ఆందోళన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : స్థానిక ఎన్నికల పోరు ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మరో గంట మాత్రమే ఓటింగ్ కు సమయం ఉండడంతో ఓటర్లు బారులుదీరుతున్నారు. అయితే.. కొన్నిచోట్ల దొంగ ఓట్లు వేసినట్లు తేలడం చర్చనీయాంశంగా మారింది. భద్రాచలం గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ బూత్ లో దొంగ ఓట్లు కలకలం రేపాయి. 11వ నంబర్ పోలింగ్ బూత్‌లో తన ఓటు ఎవరో వేశారంటూ ఓ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కోటగిరి లక్ష్మి అనే మహిళ ఓటు వేసేందుకు బూత్‌కు వెళ్లగా అప్పటికే ఆమె ఓటు వేసినట్లు రిజిస్టర్ అయింది. అదేంటి.. తాను ఇప్పుడే వచ్చానని ఆమె బూత్ అధికారులను నిలదీశారు. మీ పేరుతో ఓటు వేసినట్లు ఉందని అధికారులు చెప్పడంతో ఆమె అవాక్కయ్యారు. లక్ష్మి తరఫు బంధువులు ఆందోళన చేయడంతో అధికారులు టెండర్ ఓటింగ్ ద్వారా ఆమెతో ఓటు వేయించారు. ఇలాగే మరికొన్ని భూత్ల్లో కూడా దొంగ ఓట్లు పోలయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
…………………………………………………
