* పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరిన ఓటర్లు
* పర్వతగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎర్రబెల్లి
ఆకేరు న్యూస్, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ప్రజలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. పోలింగ్ బూత్ ల వద్ద ఉదయం నుంచే బారులు దీరారు. మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా ప్రారంభమై.. ప్రస్తుతం ఉత్సాహంగా కొనసాగుతోంది. వరంగల్ జిల్లాలోని వర్దన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల పరిధిలో 91 గ్రామాలు, 800 వార్డులు ఉండగా, అందులో 11 సర్పంచ్ స్థానాలు, 207 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 80 సర్పంచ్ స్థానాలకు 299 మంది పోటీ పడుతుండగా, 585 వార్డు స్థానాలకు 1318 మంది బరిలో నిలిచారు. పర్వతగిరి మండలంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకే సమయం ఉండడంతో ప్రజలు తరలివస్తున్నారు.
…………………………………….
