* గ్లోబల్ సమ్మిట్ విజయం, పెట్టుబడులపై చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanthreddy) మరోసారి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ(SoniaGandhi), రాహుల్ గాంధీ(RahulGandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని ఈరోజు కలిశారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రి వివేక్, కాంగ్రెస్ ఎంపీలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైన తీరు, తెలంగాణకు వచ్చిన పెట్టుబడుల గురించి వారు సోనియాకు వివరించినట్లు తెలిసింది. అలాగే పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాలు అమలు అవుతున్న తీరును వివరించారు. నిన్న మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరిన రేవంత్ రెడ్డి సాయంత్రం.. ఎన్సీపీ నేత శరద్ పవార్ పుట్టిన రోజు సందర్భంగా రాత్రి ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు హాజరయ్యారు. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అయ్యారు. అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులతో భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి సి.వేణుగోపాల్ (Venugopal)తో సమావేశమై పార్టీ పరిస్థితులు, డీసీసీ అధ్యక్షులు నియామకాలు, కార్పొరేషన్ల పదవుల భర్తీపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
……………………………………………..
