* ముగిసిన తొలి విడత పల్లె పోరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల తొలి పోరు ముగిసింది. తొలి విడతలో 3,834 పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 1 గంట వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. 2 కాగానే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాసేపట్లోనే ఫలితాల వెల్లడి ప్రారంభం కానుంది. ఇప్పటికే జయశంకర్ భూపాలజిల్లాలో 82 స్థానాలకు గాను కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన 9 మంది అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. బీఆర్ ఎస్2, బీజేపీ 1, ఇతరులు 2 స్థానాల్లో ఏకగ్రీవం అయ్యారు. మొత్తంగా తెలంగాణలో 890 గ్రామాలు ఏకగ్రీవం అయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ఇప్పటికే ప్రకటించారు. తొలివిడతలో 395, రెండో విడతలో 495గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. ఈ రోజు జరిగిన పోలింగ్ కు సంబంధించిన ఫలితాలు కాసేపట్లోనే ప్రారంభం కానున్నాయి.
……………………………………………..
