* లోయలో పడ్డ ప్రైవేటు బస్సు.. 9 మంది దుర్మరణం
* పుణ్యక్షేత్రాలకు వెళ్తుండగా దుర్ఘటన
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లోని ఆలూరి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు లోయల్ పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ప్రైవేటు బస్సు అదుపుతప్పి ఘోట్ రోడ్డు నుంచి కింద పడడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు సహా 35 మంది యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. అల్లూరి జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. రాజుగారి మెట్ట మలుపు వద్ద బస్సు ఘాట్ రోడ్డు నుంచి కింద పడింది. దీంతో ప్రయాణికులు హాహాకారాలు పెట్టారు. ఈ ప్రమాదంతో చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వాహనాలు నిలిచిపోయాయి. బస్సులోని ప్రయాణికులు కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. అన్నవరం నుంచి భద్రాచలం వైపు వెళ్తుండగా ఈ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పుణ్యక్షేత్రాల దర్శనం కోసం
చిత్తూరుజిల్లాలో విఘ్నేశ్వర ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు ట్రావెల్ బస్సు ఈ నెల ఆరో తేదీన 39 మందితో యాత్రకు బయలుదేరింది. రామ్మూర్తి అనే ఏజెంట్ ఆధ్వర్యంలో యాత్ర ప్రారంభమైంది. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని భద్రాచలంలో వెళ్తుండగా ఘాట్ రోడ్డు వద్ద అదుపు తప్పి బస్సు లోయలో పడిపోయింది. కొండ ప్రాంతం కావడం.. మితిమీరిన వేగంతో బస్సు వెళ్లడం వల్ల ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
………………………………………….
