* మేడారం ఆలయ పునర్నిర్మాణ ఫ్లోరింగ్ పనులను పర్యవేక్షించిన జిల్లా ఎస్పి
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం జాతర ఆవరణలో మాస్టర్ ప్లాన్ తో జరుగుతున్న ఫ్లోరింగ్, ప్రకారం గోడ పనులను త్వరగా పూర్తి చేయాలని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాధ్ కేకాన్ ఆదేశించారు.మంగళవారం ఆయన మేడారం ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా జరుగుతున్న ఫ్లోరింగ్ పనులు మరియు ప్రకారం గోడ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఎస్ పి పనుల పురోగతిని సమీక్షించారు. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌తో మాట్లాడుతూ. పనుల్లో ఆలస్యం జరగకుండ ఉండేందుకు పగలు రాత్రి విరామం లేకుండా పనులు చేపట్టాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. భక్తుల సౌకర్యం, భద్రత దృష్ట్యా పునర్నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఎస్పీ సూచించారు. పోలీస్ శాఖ అధికారులకు పనులపై నిరంతర పర్యవేక్షణ చేయాలని వారికీ విద్యుత్ సదుపాయం కల్పించి రాత్రి సైతం పని చేసే వీలు కల్పించాలని ఆదేశించారు.ఎస్పి వెంట ఓఎస్డీ శివం ఉపాధ్యాయ,ములుగు డిఎస్పి రవీందర్, పస్రా సిఐ దయాకర్ తో పాటు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

………………………………………..

