కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
* అనైతికంగా మాట్లాడుతున్నారు
* మోదీని అంటే.. దేశాన్ని దూషించినట్లే
* కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఆకేరు న్యూస్, డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేతగా కూడా ఉండే అర్హత లేదని, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి (Kishanreddy) అన్నారు. ఢిల్లీ(Delhi)లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 140 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ప్రధానమంత్రిని కాంగ్రెస్ కించపరుస్తోందని దుయ్యబట్టారు. అది మోదీ(Modi)ని అన్నట్లు కాదని, యావత్ దేశాన్ని కించపరిచినట్లే అన్నారు. రాహుల్ గాంధీ అనైతికంగా, కనీస అవగాహన లేకుండా రాహుల్ గాంధీ (Rahulganddhi) మాట్లాడుతున్నారని విమర్శించారు. కనీస అవగాహన లేని నేత దేశానికి ప్రతిపక్ష నేతగా ఉండడం దురదృష్టకరమన్నారు. అలాగే తెలంగాణలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సమీక్షించారు. 42 రైల్వే స్టేషన్ల రీ డిజైనింగ్ పనుల వేగవంతంపై మాట్లాడినట్లు తెలిపారు. హైదరాబాద్ – యాదగిరి గుట్ట ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్పైన, కొమురవెళ్లి రైల్వేస్టేషన్ త్వరగా పూర్తి చేయాలని చర్చించినట్లు తెలిపారు.
…………………………………………

