* ఆర్ టీ సి వైస్ చైర్మన్ నాగిరెడ్డి
* ఆర్టీసీ పోలీస్ జాతర పై సమీక్షా సమావేశం
ఆకేరు న్యూస్, ములుగు: వచ్చే నెలలో ఆదివాసి ఆచార సంప్రదాయాలతో జరుగు మేడారం మహా జాతరను ఆర్టీసీ అధికారులు పోలీస్ శాఖ అధికారుల సమన్వయంతో మాహ జాతరను విజయవంతం చేయాలని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ ఏడీజీ నాగిరెడ్డి కోరారు . సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కల్పిస్తున్న సౌకర్యాలు ఏర్పాట్లను, మేడారం ఆర్టీసీ డిపోను మంగళవారం పోలీస్ అధికారులతో ఆయన పరిశీలించారు. బస్సుల ప్రాంగణం, ప్రయాణికుల వేచి ఉండే ప్రదేశాలు, శుభ్రత, తాగునీటి సౌకర్యాలు తదితర ఏర్పాట్లకు సంబందించిన ప్రణాళికను ఆయన అడిగి తెలుసుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గత జాతర కన్నా బస్సులు అందుబాటులో ఉన్నందున ట్రాఫిక్ జాం అవకుండా తగిన జాగ్రత్తలపై ములుగు ఎస్ పి సుధీర్ రామ్ నాథ్ కెకాన్ తో చర్చించారు. ఆర్టీసీ అధికారులకు నిరంతరం సహకరిస్తూన్న పోలీస్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. జాతర సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని, అలాగే డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. భక్తుల భద్రత, సౌకర్యాలే లక్ష్యంగా ఆర్టీసీ అధికారులు పోలీసులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఓ ఎస్ డి శివమ్ ఉపాధ్యాయ ఐ పి ఎస్, ఆర్ టీ సి ఈ డి ఎం మునిశేఖర్ ఈ డి ఈ వెంకన్న, ఈ డి సాల్మన్ ఆర్ ఎం విజయ భాను, ఆర్ ఎం రవి చంద్ర ములుగు డి ఎస్ పి రవీందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శంకర్,పస్రా సి ఐ దయాకర్, ఆర్ ఐ అడ్మిన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

………………………..…………………………………

