* హైదరాబాద్ కాటేదాన్ పరిధిలో రౌడీషీటర్పై హత్యాయత్నం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాటేదాన్ పరిధిలో రౌడీషీటర్ సోహెల్పై కత్తులతో దాడి జరిగింది. వట్టేపల్లి మలుపు వద్ద అర్ధరాత్రి మరో రౌడీషీటర్, అనుచరులు సోహెల్పై దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. సోహెల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు వివరాల సేకరణకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షలే ఈ దాడికి కారణమై ఉంటాయని అనుమానిస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. కాగా నాలుగురోజుల క్రితం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమెర్ అనే మరో రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వచ్చి అమెర్పై దాడి చేశారు. ఈ దాడిలో అమెర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
…………………………………..
