* మంత్రి పొన్నం ప్రభాకర్
* మునిసిపాలిటీలో పర్యటన.. అభివృద్ధి పనులపై ఆరా
ఆకేరు న్యూస్, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. బైకు నడుపుతూ స్థానికంగా అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. అంబేడ్కర్ భవన్, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించారు. మునిసిపల్ కమిషనర్, స్థానిక అధికారులతో సమావేశమయ్యారు. అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, జంక్షన్ల ఆధునీకరణపై మాట్లాడారు. అలాగే స్థానికులను కూడా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హుస్నాబాద్ మునిసిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేలా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు.
……………………………………..
