* బీజేపీ కార్యాలయం ముందు నిరసన తెలుపుతాం : మహేశ్‌కుమార్ గౌడ్
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ గేటు ముందు కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ అగ్రనేతలు మీనాక్షి నటరాజన్,(Meenakshi Natarajan), మధుయాష్కీ గౌడ్ (Madhuyaski Goud) కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం గాంధీభవన్ నుంచి బీజేపీ కార్యాలయానికి ర్యాలీ తలపెట్టనుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబాన్ని వేధిస్తున్నారని కాంగ్రెస్ (Congress) నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపేందుకే బీజేపీ (Bjp) కార్యాలయానికి వెళ్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయం ముందు కూర్చుని ఆందోళన చేస్తామని వెల్లడించారు. దీంతో పోలీసులు గాంధీభవన్ గేట్లను మూసివేశారు. నేతలు బయటకు రాకుండా కట్టడి చేశారు. దీంతో గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. మోదీ డౌన్ డౌన్.. అంటూ కాంగ్రెస్ నేతలు నినదించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అంటున్నారు. ఈనేపథ్యంలో గాంధీభవన్ వద్ద తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు.
………………………………………………..
