– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, కమలాపూర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీ దుమ్ములేపిందని సామాజిక వేదికల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలు కేసిఆర్ పార్టీకే పట్టం కట్టారని అన్నారు. నియోజకవర్గంలో 44 మంది సర్పంచులు, 80 శాతం మంది వార్డ్ మెంబర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారనీ , కాంగ్రెస్ 28, బిజెపి 25, ఇతరులు 10 గెలిచారని అన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సర్పంచ్ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయారనీ ప్రజలు గమనించాలని అన్నారు. గెలిచిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు, వార్డ్ మెంబర్లకు అభినందనలు తెలిపారు. హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.

…………………………………….
