* పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఛైర్పర్సన్ల సదస్సులో రాష్ట్రపతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : లక్ష్య సాధనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ముందుండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) సూచించారు. నియామకాల విషయంలో ప్రస్తుతం వేగంగా స్పందించడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City)లో జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఛైర్పర్సన్ల సదస్సులో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత వృద్ధిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఉద్యోగాల భర్తీలో పారదర్శక విధానాలను అవలంబిస్తున్నాయని కొనియాడారు. అంతేకాకుండా భారత వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. వికసిత భారత్-2047 సాధనలో పబ్లిక్ సర్వీసు కమిషన్లు కూడా భాగస్వామ్యం కావాలన్నారు. 1950 తర్వాత యూపీఎస్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు మొదలైందని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విషయంలో అంబేడ్కర్ కీలక పాత్ర పోషించారని వివరించారు. ఈ సదస్సులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnudev Varma), మంత్రి సీతక్క, టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం, యూపీఎస్సీ ఛైర్మన్ అజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
………………………………………………
