* హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద దీక్ష
* దీక్షలో కూర్చున్న ఎమ్మెల్యేలు తలసాని, ముఠాగోపాల్
* మేయర్ కు కూడా తెలియకుండా విభజన సిగ్గుచేటు : తలసాని
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఇందిరాపార్కు వద్ద దీక్ష కొనసాగుతోంది. లష్కర్ జిల్లా సాధణ సమితి ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivasyadav), ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ (Muta Gopal) తదితరులు పాల్గొన్నారు. తలసాని మాట్లాడుతూ లష్కర్ కార్పొరేషన్ (Laskar Carporation) ఏర్పాటు చేయాల్సిందే అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ను కార్పొరేషన్ గా చేయాలనేది స్థానికుల డిమాండ్ అన్నారు. తమ ప్రాంత ఆదాయాన్ని స్థానిక అభివృద్దికే ఖర్చు చేయాలని అన్నారు. ఈ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. డివిజన్ల పునర్విభజన కూడా సరిగా చేయలేదని విమర్శించారు. మేయర్ కు కూడా తెలవకుండా డివిజన్ల విభజన చేయడం సిగ్గు చేటన్నారు.
………………………………………….
