సుప్రీంకోర్టు
* సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం
* 25 వరకు విచారణకు గడువు పొడిగింపు
* 26న విడుదల చేయాలని సిట్‌కు ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీస్ కస్టడీని మరికొన్ని రోజులు పొడిగిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. డిసెంబరు 25 వరకు అనుమతినిచ్చింది. తొలుత డిసెంబర్ 25 వరకు కస్టోడియల్ విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. నిన్నటి తో గడువు ముగియడంతో మరికొన్ని రోజులు విచారణ చేయాలని సుప్రీంకోర్టు(supreme court)ను సిట్ కోరింది. వారం రోజుల కస్టోడియల్ విచారణ రిపోర్ట్‌ను న్యాయస్థానానికి సిట్ అందజేసింది. వాటిని పరిశీలించిన ధర్మాసనం మరో వారం రోజులపాటు కస్టోడియల్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. ఆయనకు ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు, అవసరమైన మందులు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే, డిసెంబర్ 26న పోలీస్ కస్టడీ నుంచి ప్రభాకర్ రావును విడుదల చేయాలని, తదుపరి విచారణ వరకు ఎలాంటి వ్యతిరేక చర్యలూ తీసుకోవద్దని స్పష్టం చేసింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 16కు వాయిదా వేసింది.
……………………………………………………………………………….

