* సంగారెడ్డి జిల్లాలో యువతి మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితుడితో ఉండగా తండ్రి రావడంతో దొరికిపోతామనే భయంతో బాల్కనీ గుండా పక్క ఫ్లాట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన యువతి జారి పడి దుర్మరణం చెందింది. సంగారెడ్డి జిల్లా కేసీఆర్ నగర్ కు చెందిన యువతికి, ఒకే కంపెనీలో పనిచేస్తున్న యువకుడితో పరిచయం ఉంది. యువతి కుటుంబానికి కేసీఆర్ నగర్లోని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించారు. స్నేహితుడు హుస్సేన్ అలీ తో కలిసి ఆమె డబుల్ బెడ్ రూమ్ ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో ఆమె తండ్రి రావడంతో దొరికిపోతామనే భయంతో ఆమె హుస్సేన్ అలీ సహకారంతో బాల్కనీ గుండా పక్క ఫ్లాట్లోకి వెళ్లడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో పట్టుతప్పి ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడి ఫాతిమా అక్కడికక్కడే దుర్మరణం చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………………….

