* రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ ప్రెస్ వేపై వాహనాల బారులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ ప్రెస్ వేపై చోటుచేసుకున్న ప్రమాదంతో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. అంతేకాదు.. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. ఎక్స్ ప్రెస్ వే (Express Way) పిల్లర్ 253 వద్ద ఒకదానికొకటి మూడు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల ఉప్పర్ పల్లి (Upperpally) నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకూ భారీ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు ముందుకు కదలడం లేదు. రాజేంద్రనగర్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువైపు వెళ్లేవారు ప్రత్యామ్నాయ రహదారులను చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
……………………………………..
