తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్
* నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ భవన్లో రేపు బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నేతలు సమావేశం కానున్నారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై పోరుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఈ సమావేశంలో కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత గులాబీ బాస్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమావేశాలు, పార్టీ నేతలతో సమావేశాలను కూడా కేసీఆర్ అక్కడి నుంచే నిర్వహిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ విూడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
………………………………

