* ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పేరు మార్పుపై ఆగ్రహం
* రైతుల, కూలీల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని వెల్లడి
* నల్లచట్టానికి వ్యతిరేకంగా లక్షల మంది పోరాటానికి పిలుపు
ఆకేరున్యూస్, డెస్క్ : ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)ను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. దాని రూపురేఖలను కూడా మార్చేసిందని విమర్శించారు. కోట్లాది మంది రైతుల, కూలీల ప్రయోజనాలను దెబ్బతీశారని అన్నారు. గ్రామీణ పేదలను మోదీ ప్రభుత్వం విమర్శిస్తోందని ఆరోపించారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో ప్రభుత్వం నల్లచట్టం తెస్తోందని వెల్లడించారు. నల్లచట్టంపై పోరాడేందుకు లక్షల మంది కార్యకర్తలు సిద్దంగా ఉన్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలిపారు. కాగా, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) నిధులకు మోదీ సర్కారు ఎసరు పెట్టిందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఉపాధి నిధుల్లో కేంద్రం వాటాను భారీగా కుదించుకున్నది. 90% నుంచి 60 శాతానికే తన వాటా నిదులను పరిమితం చేసుకున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈక్రమంలో ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.
……………………………….

